తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.39 పెరగగా.. కిలో వెండిపై రూ.36 ఎగబాకింది.

Gold, silver rise marginally
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

By

Published : Dec 29, 2020, 4:03 PM IST

బంగారం ధర మంగళవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.36 ఎగిసి.. రూ.49,610 వద్దకు చేరింది.

పసిడి బాటలోనే పయనించిన వెండి ధర రూ.36 పెరిగి.. కిలో వెండి రూ.68,156కు ఎగబాకింది.

"అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధరల పెరుగుదల సహా డాలర్​తో పోల్చితే రూపాయి బలపడటం వల్ల దేశీయంగానూ పసిడి ధరలు పుంజుకుంటున్నాయి" అని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,883 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర 26.26 డాలర్లు పలుకుతోంది.

ఇదీ చూడండి:రెండో రోజూ బుల్​ జోరు- సరికొత్త శిఖరాలకు సూచీలు

ABOUT THE AUTHOR

...view details