భారత్ నుంచి పంది, అడవి పంది సంబంధిత ఉత్పత్తుల దిగుమతులపై చైనా నిషేధం విధించింది. భారత్లోని పందుల్లో విజృంభిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ(ఏఎస్ఎఫ్) కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చైనా పశుసంరక్షణశాఖ తెలిపింది.
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో చైనా నిర్ణయానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశీయ, అడవి పందుల్లో ఎస్ఎఫ్కు సంబంధించిన తొలి కేసు ఈ నెల తొలి వారంలో అసోంలో నమోదైంది. అయితే ఈ ఏడాది తొలినాళ్లల్లోనే ఏఎస్ఎఫ్ రోగ నిరోధక, నియంత్రణ చర్యలు చేపట్టింది చైనా. మంచి ఫలితాలను కూడా రాబట్టగలిగింది. దీంతో పోర్క్ ధరలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే ఏడాదిలోగా ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని చైనా భావిస్తోంది.
చైనాలోని అధిక జనాభా పోర్క్ను రోజూ వినియోగిస్తుంది. నిజానికి ఈ ఏఎస్ఎఫ్.. 2018 ఆగస్టులో చైనాలోనే పుట్టింది. చైనాలోని ఈశాన్య రాష్ట్రమైన లైయోనిగ్లో తొలి కేసులు నమోదయ్యాయి.