దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున విమానయాన సంస్థలకు విధించిన ఆంక్షలను మరింత సడలించాలని కేంద్రం నిర్ణయించింది. నాలుగు గంటల వ్యవధిలోపు ప్రయాణం పూర్తిచేసుకునే విమానాల్లో ఐసోలేషన్ జోన్‌ని ఏర్పాటుచేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అంతర్జాతీయ విమానాలకు సడలింపులివ్వాలని ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ చేసిన విజ్ఞప్తి అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
'ఆ విమానాల్లో ఐసోలేషన్ జోన్ అక్కర్లేదు' - air india
విమానంలో ఐసొలేషన్ జోన్ ఉండాలన్న నిబంధనలో కేంద్రం మార్పలు చేసింది. నాలుగు గంటల్లోపు ప్రయాణం పూర్తిచేసుకునే విమానాలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.

విమానయాన సంస్థలకు నిబంధనల సడలింపు
ఈ నెల 16న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలలో క్వారంటైన్ కోసం ఏదైనా సీటును ఖాళీగా విడిచి పెట్టాలన్న నిబంధనను సవరించింది. నాలుగు గంటలకు మించిన ప్రయాణ వ్యవధి ఉన్న విమానాల్లో చివరి వరుసలోని కుడివైపునున్న సీట్లను క్వారంటైన్ కోసం రిజర్వు చేయాలని ఆదేశాల్లో తెలిపింది. గగనతలంలో ప్రయాణికులకు కొవిడ్ సంబంధిత లక్షణాలు వృద్ధి చెందితే.. వారికోసం అవసరమైన పీపీఈ కిట్లను విమానయాన సంస్థలు సమకూర్చాలని పేర్కొంది.
ఇదీ చూడండి :బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య