తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2021, 12:29 PM IST

ETV Bharat / business

వైమానిక దళానికి బుల్లెట్​ ప్రూఫ్ వాహనాలు

భారత వైమానిక దళానికి.. అవసరాలకు తగ్గట్టుగా అశోక్​ లే ల్యాండ్​ బుల్లెట్​ ప్రూఫ్​ వాహనాలను తయారు చేసింది. మొదటి విడతలో భాగంగా కొన్ని వాహనాలను ఐఏఎఫ్​కు అందజేసింది.

Ashok Leyland, bulletproof vehicles to the Air Force
వైమానిక దళానికి బుల్లెట్​ ప్రూఫ్ వాహనాలు

భారత వైమానిక దళానికి తేలికపాటి బుల్లెట్​ ప్రూఫ్​ వాహనాల (ఎల్​బీపీవీ) మొదటి విడత సరఫరా పూర్తి చేశామని అశోక్​ లేలాండ్​ తెలిపింది. లాక్​హీడ్​ మార్టిన్​కు చెందిన సీపీఎన్​జీ(కామన్​ వెహికల్​ నెక్ట్స్​జెన్​) వెర్షన్​ ఆధారంగా తయారుచేసిన ఈ అధునాతన వాహనాలను 13న అందజేశామని ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది.

లాక్​హీడ్​ మార్టిన్​ నుంచి ఆశోక్​ లేలాండ్​కు సాంకేతిక బదలాయింపుతో ఈ వాహనాలను అభివృద్ధి చేశామని భారత్​లోనే పూర్తిగా వీటిని తయారు చేశామని పేర్కొంది. బురద, ఇసుక, రాళ్లు ఉన్న రహదారులతో పాటు తక్కువ లోతున్న నీళ్లపైనా ఈ ఎల్​బీపీవీలు సునాయాసంగా వెళ్లగలవు. ఇందులో ఆరుగురు ప్రయాణం చేసేందుకు వీలుండటంతో పాటు సామగ్రి పెట్టుకునేందుకు తగినంత స్థలమూ ఉంటుంది. తుపాకీ గుళ్ల దాడి నుంచే కాదు బాంబు పేలుళ్ల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి.

"సైనిక దళాలకు వాహనాలను సరఫరా చేయడాన్ని ఎంతో గర్వించదగ్గ విషయంగా మేం భావిస్తున్నాం. వాహనాల సరఫరా ద్వారా దేశానికి మా వంతు సేవను అందించే అవకాశం రావడం ఆనందంగా ఉంది."

-విపిన్​ సోంది, అశోక్​ లేలాండ్​ ఎండీ

ఇదీ చూడండి:ఈ 'పింక్‌' లింక్‌ మీకూ వచ్చిందా?

ABOUT THE AUTHOR

...view details