దేశానికి ఆండ్రాయిడ్ మాల్వేర్ "బ్లాక్రాక్" ముప్పు పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ హెచ్చరించింది. ఈ బ్లాక్రాక్.. వినియోగదారుల బ్యాంకింగ్ వివరాలు సహా ఇతర రహస్య సమాచారాలను దొంగిలించగలదని పేర్కొంది.
ఈ-మెయిల్, ఈ-కామర్స్ యాప్లు, సామాజిక మధ్యమాల యప్లతో పాటు బ్యాంకింగ్- ఆర్థిక యాప్లు సహా 300లకుపైగా యాప్ల నుంచి వినియోగదారుల క్రెడిట్ కార్టుల వివరాలను ఈ బ్లాక్రాక్ పొందగలదని 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్'(సీఈఆర్‌టీ-ఇన్) హెచ్చరించింది. ట్రోజన్ కేటగిరిలోని ఈ వైరస్.. ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్గా ఉందని వెల్లడించింది.
"పరికరంలో మాల్వేర్ పని చేయడం ప్రారంభించిన అనంతరం.. దాని ఐకాన్ కనుమరుగవుతుంది. ఆ తర్వాత నకిలీ గూగుల్ అప్డేట్గా ప్రత్యక్షమవుతుంది. అనుమతి కోసం వినియోగదారుడిని అడుగుతుంది. ఒక్కసారి అనుమతిస్తే.. మరికొన్ని అనుమతులు దాని అంతట అదే పొందుతుంది. వినియోగదారుడితో సంబంధం లేకుండా అనేక ముఖ్యమైన విషయాలకు స్వయంగా అనుమతులు ఇచ్చుకుంటుంది. ఆ తర్వాత వినియోగదారుడి బ్యాంకింగ్ వివరాలను దోచుకుంటుంది."