Richest persons in the world: ప్రపంచ కుబేరుల జాబితాలో నిన్నటి వరకు టాప్-10లో ఉన్న మార్క్‌జుకర్‌బర్గ్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆయనకు చెందిన మెటా సంస్థ షేర్లు గురువారం రికార్డు స్థాయిలో 26శాతం పతనమయ్యాయి. దీంతో 24 గంటల్లోనే 29 బిలియన్ డాలర్ల జుకర్‌బర్గ్ సంపద ఆవిరైంది. చరిత్రలో నమోదైన అత్యంత భారీ నష్టాల్లో ఇది రెండోది కావడం గమనార్హం.
జుకర్‌బర్గ్‌కు సంపద భారీగా తగ్గడం వల్ల ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానానికి పడిపోయారు. ఫలితంగా ఆయన అస్తుల విలువ భారత కుబేరులు అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ కంటే తక్కువగా నమోదైంది. అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అదానీ ఆస్తులు విలువ 90.1 బిలియన్ డాలర్లు కాగా.. 11వ స్థానంలో ఉన్న అంబానీ ఆస్తుల విలువ 90 బిలియన్ డాలర్లుగా ఉంది. జుకర్‌బర్గ్ ఆస్తుల విలువ 89 బిలియన్ డాలర్లకే పరిమితమైంది.
Top 10 rich persons
మరోవైపు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద మాత్రం మరో 20 బిలియన్ డాలర్లు పెరిగింది. అమెజాన్ భారీ లాభాలు ఆర్జించడం వల్ల ఇది సాధ్యమైంది.