మనుషులను అవసరానికి వాడుకొని... వదిలేయడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్యని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. నాలుగేళ్ల తెరాస పాలనపై మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా... ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడం విడ్డురంగా ఉందన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సిద్దిపేటలో మెడికల్ కళాశాల, గజ్వేల్‌లో పూర్తికావొస్తున్న రైల్వేలైన్ కేంద్రం ఇచ్చినవేనని గుర్తు పెట్టుకోవాలన్నారు.
ట్రబుల్ షూటర్ కాస్తా ట్రబుల్ అయిండు
తెరాసలో ట్రబుల్ షూటర్‌గా కీర్తించే హరీశ్ ట్రబుల్ అయ్యారని ఎద్దేవా చేశారు మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చిన అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు