తెలంగాణ

telangana

ETV Bharat / briefs

లోక్​సభకు పోటీ చేయాలా? వద్దా? సందిగ్ధంలో తెజస

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధంలో పడింది తెజస. నాలుగు స్థానాల్లో పోటీ చేస్తామని ఆపార్టీ అధ్యక్షుడు కోదండరామ్​ ప్రకటించినా.. స్పష్టత రాలేదు. పోటీపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ జన సమితి

By

Published : Mar 22, 2019, 8:00 AM IST

తెలంగాణ జన సమితి
లోక్​ సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై తెలంగాణ జన సమితి ఎటూ తేల్చుకోలేకపోతోంది. నాలుగు పార్లమెంట్​ స్థానాల్లో బరిలో దిగుతామని... మిగతా స్థానాల్లో కాంగ్రెస్​కు మద్దతిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్​ ప్రకటించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీ భేటీలో ఆ నాలుగు స్థానాల్లో కూడా పోటీ చేయాలా వద్దా అనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

పార్టీ బలోపేతం చేసుకుందాం..

రాష్ట్రంలో పార్టీ ఉనికి చాటుకోవాలంటే కొన్ని స్థానాల్లోనైనా పోటీ చేయాలని కొందరు పార్టీ సభ్యులు సూచించగా... ఓట్లు చీలకుండా కాంగ్రెస్​కు మద్దతు ఇద్దామని మరికొందరు అభిప్రాయపడ్డట్లు సమాచారం. లోక్​సభ ఎన్నికల్లో బరిలో దిగడం కంటే రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికల్లో ఉనికిని చాటుకునే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనే సూచనలూ వచ్చాయి.

పోటీపై మల్లగుల్లాలు..

పార్లమెంట్​ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, మల్కాజిగిరితో పాటు మరో స్థానంలో పోటీ చేస్తామని కోదండరామ్​ ఇప్పటికే ప్రకటించారు. ఈ నాలుగు స్థానాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదన రాష్ట్ర కమిటీలో వచ్చింది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్​రెడ్డి ఇప్పటికే కోదండరామ్ మద్దతు కోరినందున... ఆస్థానంలో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది తెజస. కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్లో పోటీపై మల్లగుల్లాలు పడుతోంది.

లోక్​సభ పోటీపై భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో బరిలో నిలవడంపై మరో రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెజస వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి:లక్ష్యం పదహారు.. గెలుపు గుర్రాలకే పెద్దపీట

ABOUT THE AUTHOR

...view details