ఈ నెల 27 నుంచి జులై 6 వరకు జరగనున్న 'మహారాజ రంజిత్ సింగ్' వర్ధంతి నేపథ్యంలో 463 మంది భారత సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేసింది పాకిస్థాన్. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న సిక్కులకు వీసాలు జారీ చేసినట్టు పాక్ హై కమిషన్ వెల్లడించింది.
జూన్ 14-23 మధ్య 'గురు అర్జున్ దేవ్ జీ' బలిదాన దినాన్ని పురస్కరించుకొని సిక్కు యాత్రికులకు వీసాలు ఇచ్చింది పాక్.