తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'మరో 15 ఏళ్లు కేసీఆర్​, జగన్​లదే అధికారం' - saradha peetam

కృష్ణా నదీతీరంలో గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో జరిగిన శారదాపీఠ ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేసీఆర్, జగన్ మరో 15 ఏళ్లు సీఎంలుగా పని చేయాలి స్వరూపానందస్వామి ఆకాక్షించారు.

స్వరూపానందేంద్ర సరస్వతి

By

Published : Jun 17, 2019, 8:40 PM IST

'మరో 15 ఏళ్లు కేసీఆర్​, జగన్​లదే అధికారం'
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి జగన్​ మరో 15 ఏళ్లు సీఎంలుగా పని చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు. అమరావతిలో కృష్ణానదీ తీరంలో శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణలో కేసీఆర్​, జగన్​ పాల్గొన్నారు. శారదాపీఠ ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఇరు ముఖ్యమంత్రులు... స్వామివార్లకు పుష్పాలు, ఫలాలు, వస్త్రాలు సమర్పించుకున్నారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతికి కిరీట ధారణ చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతికి సీఎం కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేశారు.

జగన్​ అంటే ప్రాణం..

కేసీఆర్, జగన్​లకు స్వాత్మానందేంద్రస్వామి ఇష్టుడని స్వరూపానందస్వామి అన్నారు. భవిష్యత్తు చెప్పే ఏకైక పీఠం విశాఖ శారదాపీఠం అని అభిప్రాయపడ్డారు. 2024 నాటికి పీఠాధిపతి బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తానని తెలిపారు. స్వాత్మానందేంద్ర హిందూధర్మాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని ఆకాంక్షించారు. శారదాపీఠం లోకానికి ఆధ్యాత్మిక శక్తిని బోధిస్తోందని ఉద్ఘాటించారు. ముగింపు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు రావడం సంతోషకరమన్నారు. జగన్ అంటే తనకు ప్రాణమని స్వరూపానందస్వామి అన్నారు.

ఇదీ చూడండి : శారదాపీఠ ఉత్తరాధికారి సన్యాస స్వీకార మహోత్స
వం

ABOUT THE AUTHOR

...view details