తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇంటర్ వ్యవహారంలో ప్రభుత్వం విఫలం: కిషన్​రెడ్డి - కొండ్రోనిపల్లి

ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కిషన్​రెడ్డి. ఈరోజు నారాయణపేట జిల్లా కొండ్రోనిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి శిరీష కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

ప్రభుత్వం విఫలం

By

Published : May 8, 2019, 5:57 PM IST

ఇంటర్మీడియట్ ఫలితాల నిర్వహణలో ఇంటర్ బోర్డు వైఫల్యం చెందిందని మండిపడ్డారు భాజపా నేత కిషన్​రెడ్డి. 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన ధ్వజమెత్తారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రోనిపల్లి గ్రామంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్ల శిరీష అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పపడింది. బాధిత కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ నేత కిషన్​రెడ్డి పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు భాజపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అధికారులు, మంత్రులు చలించలేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు జితేందర్​రెడ్డి, నాగూరావు నామాజీ, రతన్ పాన్​రెడ్డి, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ వ్యవహారంలో ప్రభుత్వం విఫలం: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details