తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆ విషయంలో కేసీఆర్​వి పగటి కలలే: లక్ష్మణ్​

ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాకుంటే గెలిచిన కొద్ది మంది ఎంపీలతో కేసీఆర్​ కేంద్రంలో చక్రం తిప్పాలకుకోవడం పగటి కలలేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​ కేవలం తెలంగాణ సెంటిమెంట్​తోనే విజయం సాధించారని విమర్శించారు.

ఆ విషయంలో కేసీఆర్​వి పగటి కలలే

By

Published : Apr 17, 2019, 5:14 PM IST

రాష్ట్రంలో తెరాసకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. అందువల్లనే కాంగ్రెస్​ అగ్రనేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఇవాళ హైదరాబాద్​లోని రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటుతోనే కేసీఆర్​ విజయం సాధించారని లక్ష్మణ్​ విమర్శించారు. రాష్ట్రం దాటితే తెరాస చెల్లని రూపాయేనని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం సొంతంగానే 300 సీట్లు సాధింస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా సమయం ఉన్నా స్థానిక సంస్థల రూపంలో బీసీలకు మరోసారి కేసీఆర్​ అన్యాయం చేస్తున్నారన్నారు.

ఈ భేటీలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మురళీధర్​రావు, కిషన్​రెడ్డి, జితేందర్​రెడ్డి, రామచంద్రరావు, రాపోలు ఆనందభాస్కర్​, ఇంద్రసేనా రెడ్డి ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఆ విషయంలో కేసీఆర్​వి పగటి కలలే
ఇవీ చూడండి: సీఎం హెలికాప్టర్​ తనిఖీ చేసిన అధికారులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details