నేడు ఉప్పల్ మైదానంలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరగబోయే తుదిపోరుకు సంబంధించిన టికెట్లు ఎప్పుడో అమ్ముడైపోయాయి. ఒక్క టికెట్ అయినా దొరుకుతుందని ఇంకా స్టేడియం వద్ద క్రీడాభిమానులు పడిగాపులు కాస్తున్నారు. కాని తమకు ఏకంగా 300 టికెట్లు కావాలని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికారి ఐపీఎల్ నిర్వాహకులకు లేఖ రాశారు. ఉన్నతాధికారులకు టికెట్లు కావాలని అధికారిక పత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సంబంధిత శాఖ అధికారులు బాధ్యులకు మొమో ఇచ్చి వివరణ కోరుతామని తెలిపారు.
300 ఐపీఎల్ టికెట్లు కావాలి: అబ్కారీ అధికారి లేఖ
ఐపీఎల్ తుది పోరు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఒక్క టికెట్ దొరికితే చాలనుకుంటున్న అభిమానులు ఈ విషయం తెలిస్తే నిర్ఘాంత పోతారు. ఏకంగా 300 టికెట్లు కావాలని ఆబ్కారీ శాఖ అధికారులు ఐపీఎల్ నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సదరు అధికారికి మెమో ఇచ్చి వివరణ కోరుతామంటున్నారు.
excise-deportment