తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఈనెల 8న శంషాబాద్​లో అమిత్​ షా సభ - telangana elections

కమల దళపతి అమిత్‌ షా తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. లోక్​సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు.  శంషాబాద్​లో సోమవారం సాయంత్రం నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు.

ఈనెల 8న శంషాబాద్​లో అమిత్​ షా సభ

By

Published : Apr 6, 2019, 6:26 AM IST

Updated : Apr 6, 2019, 11:11 PM IST

భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఈ నెల 8న ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి రానున్నారు. చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్​లో సోమవారం సాయంత్రం నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. ముందుగా అనుకున్న ప్రకారం 6న హైదరాబాద్​, నల్గొండ రోడ్​షోల్లో పాల్గొనాల్సి ఉంది. సమయాభావం కారణంగా వాటిని రద్దు చేసినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. అమిత్​ షా తన ప్రసంగంతో శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని... మరోసారి భాజపా అధికారంలోకి తెచ్చేందుకు బూత్‌ స్థాయి నుంచి అందరూ కృషి చేయాలని కోరారు.

ఈనెల 8న శంషాబాద్​లో అమిత్​ షా సభ
Last Updated : Apr 6, 2019, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details