ఓరుగల్లులోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ పల్లకిలో ఊరేగించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో పాటు తెరాస మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ గుండు సుధారాణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అమ్మవారి కల్యాణం... కడు రమణీయం
మేళతాళాలు... ఊరేగింపులు... నామస్మరణల మధ్య భద్రకాళీ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేల సంఖ్యలో భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలన్నీ కోలాహలంగా మారిపోయాయి.
మేళతాళాలు... ఊరేగింపులు...