ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ యత్నం - inter
ఇంటర్ ఫలితాల అక్రమాలను నిరసిస్తూ... ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ యత్నించింది. ఆందోళనల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. బాధ్యులపై చర్యలతో పాటు, విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ యత్నం
అఖిలపక్ష నేతలు ఇంటర్ బోర్డు ముట్టడికి ప్రయత్నించగా... విద్యార్థి సంఘాల నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించాయి. మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని... బోర్డు కార్యదర్శి అశోక్‌ను తొలగించాలని డిమండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు. గ్లోబరినాపై క్రిమినల్ కేసు పెట్టాలని అన్నారు. విద్యార్థి సంఘాల నేతలు ప్రగతి భవన్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ యత్నం