తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఆర్థిక బిల్లుకు లోక్​సభ ఆమోదం - Loksabha

2019 ఆర్థిక బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది.

లోక్​సభలో ప్రసంగిస్తున్న ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​

By

Published : Feb 12, 2019, 9:52 PM IST

లోక్​సభలో ప్రసంగిస్తున్న ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​
2019 ఆర్థిక బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ మంగళవారం లోక్​సభలో బిల్లును ప్రవేశపెట్టారు. మెజారిటీ సభ్యులు బిల్లుకు మద్దతు తెలిపినందున స్పీకర్​ సుమిత్రా మహాజన్​ ఆమోదముద్ర వేశారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.

ప్రతిపక్షాల నిరసనలు

దేశంలో నిరుద్యోగం, రైతు సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ నేతలు నినాదాలు చేశారు. మోదీ అధికారంలోకి వస్తే ​ప్రజలకు మంచిరోజలు (అచ్చేదిన్) వస్తాయని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో సర్కార్​ దేశ ప్రజలకు ఏమీ చేయలేదని ఆందోళనలు చేశారు. మోదీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details