ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్(100) తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమె శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ సమయంలో ప్రపంచ నేతలు, రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మోదీకి అండగా నిలిచారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
'ప్రధాని మోదీ తల్లి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.' అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ట్వీట్ చేశారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ట్వీట్ 'ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మరణించిన విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మోదీ, ఆయన కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా'
--పుష్ప కమల్ దహల్ ప్రచండ, నేపాల్ ప్రధాని
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ట్వీట్ 'ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను. ఈ విషాద సమయంలో ప్రధాని మోదీ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'
--రణిల్ విక్రమసింఘే, శ్రీలంక అధ్యక్షుడు
'తల్లిని కోల్పోవడం కంటే పెద్ద నష్టం మరొకటి లేదు. ప్రధాని మోదీ తల్లి తల్లి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నా'
--షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ప్రధాని
ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. 'ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల నేను చాలా బాధపడ్డా. ఆమె తన బిడ్డల పట్ల చూపే ప్రేమ అదర్శనీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.' అని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ట్వీట్ చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. ప్రధాని మోదీ తల్లి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ సైకత శిల్పం గీసిన సుదర్శన్ పట్నాయక్ శివసేన నేత సంజయ్ రౌత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, గవర్నర్ అనసూయ ఉకే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్.. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మీ తల్లి మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డానని ట్వీట్ చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.
ప్రధాని మోదీ తల్లి మరణవార్త చాలా బాధాకరం అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు శిందే తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మృతి పట్ల మహారాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం సంతాపం తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ మృతి పట్ల సినీ ప్రముఖులు రజనీకాంత్, ధర్మేంద్ర, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, అయన భార్య కాజోల్, మలయాళ నటుడు మోహన్‌లాల్, నటుడు సోనూ సూద్, హీరో సిద్దార్థ మల్హోత్రా విచారం వ్యక్తం చేశారు.
'హీరాబెన్ అందించిన విలువలు మోదీ వంటి నాయకుడిని దేశానికి ఇచ్చాయి. ప్రధాని తల్లి మృతి పట్ల నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నా.'
--అజయ్ దేవగణ్, బాలీవుడ్ నటుడు
మోదీ.. కర్మయోగి..
తల్లి మరణించిన రోజు కూడా తన అధికారిక కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరుకావడంపై ఆయన మంత్రివర్గ సహచరులు, భాజపా నాయకులు ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీని కర్మయోగిగా అభివర్ణించారు.