తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ మాట రాహుల్​ అప్పుడే అనాల్సింది' - భాజపా

కాంగ్రెస్​లో ఉంటే ఎప్పటికైనా జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి అయ్యేవారన్న వ్యాఖ్యలపై సింధియా గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్​లో ఉన్నప్పుడు రాహుల్​ ఈ మాటలు అని ఉంటే బాగుండేదని అన్నారు.

Wish he was as concerned earlier as he is now: Scindia hits back at Rahul
'ఈ మాట రాహుల్​ గాంధీ అప్పుడే అనాల్సింది'

By

Published : Mar 9, 2021, 3:46 PM IST

భాజపా ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.. కాంగ్రెస్​లో ఉంటే ఎప్పటికైనా మధ్యప్రదేశ్​ సీఎం అయ్యేవారన్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యలపై సింధియా స్పందించారు.

"నేను సీఎం అవుతానని కాంగ్రెస్​లో ఉన్నప్పుడు రాహుల్​ అంటే బాగుండేది. పరిస్థితి వేరేలా ఉండేది."

--జ్యోతిరాదిత్యా సింధియా, భాజపా ఎంపీ

సింధియా కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యేవారని రాహుల్ సోమవారం​ అన్నారు. భాజపాలో చివరి వ్యక్తి (బ్యాక్‌ బెంచర్‌)గా నిలిచారని దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ యువజన సమావేశంలో ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రివి అవుతావని తాను సింధియాకు చెప్పానని, కానీ, అందుకు విరుద్ధంగా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు భాజపాలో చివరి వ్యక్తిగా నిలిచారని వ్యాఖ్యానించారు. "కావాలంటే ఇది రాసి పెట్టుకోండి. సింధియా భాజపాలో ఉంటే ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు" అని రాహుల్‌ అన్నారు. సీఎం కావాలనుకుంటే వెనక్కి వచ్చేయాలని సూచించారు.

ఇదీ చూడండి:ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పు ఖాయం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details