అల్లోపతి వైద్యులపై యోగా గురు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది సమయంలో 1000 మంది అల్లోపతి డాక్టర్లను ఆయుర్వేద వైద్యులుగా మారుస్తానని ప్రకటించారు.
ప్రజలకు ఆయుర్వేదం శక్తి తెలియ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాందేవ్ పేర్కొన్నారు. చాలా మంది విశ్రాంత అల్లోపతి డాక్టర్లు ఆయుర్వేద వైద్యులుగా మారేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.