అసెంబ్లీ ఎన్నికల ముందు బంగాల్ సీఎం మమతా బెనర్జీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ మంత్రి బచ్చు హన్స్దా, ఎమ్మెల్యే గౌరీ శంకర్ దత్తా.. బుధవారం భాజపాలో చేరారు. వీరిద్దరికీ తృణమూల్ కాంగ్రెస్ టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో పార్టీ మారారు.
తపన్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి హన్స్దా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తృణమూల్ కాంగ్రెస్లో గౌరీ శంకర్ దత్తా సీనియర్ నేత. తెహత్తా నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.