కర్ణాటక అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఒకేసారి 9 మంది అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి కర్ణాటలోని 11 జిల్లాల్లో 9 మంది అధికారులకు చెందిన 28 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా రేంజ్‌ల ఎస్పీల పర్యవేక్షణలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ అధికారులంతా వేర్వేరు విభాగాలు, శాఖల్లో, వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలు రావడంతో ఆయా అధికారుల ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ నుంచి టౌన్ ప్లానింగ్ విభాగం ఇంజనీరింగ్ అధికారుల వరకూ ఈ అధికారుల్లో ఉన్నారు. వారి ఆస్తుల వివరాలు లెక్కతీసే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.