తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2021, 5:35 AM IST

ETV Bharat / bharat

విధి నిర్వహణలో సుప్రీంకోర్టుకు 71 ఏళ్లు

సుప్రీంకోర్టు తన విధి నిర్వహణలో 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసిన రిజిస్ట్రీ... పౌరుల స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణతో పాటు రాజ్యాంగ విలువలను రక్షించేందుకు సుప్రీంకోర్టు పాటుపడిందని పేర్కొంది. కరోనాతో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ అవాంతరాలు లేకుండా కార్యకలాపాలు సాగించినట్లు వివరించింది.

supreme-court-completes-71-years-of-functioning
విధి నిర్వహణలో సుప్రీంకోర్టుకు 71 ఏళ్లు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన విధి నిర్వహణలో 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరోనా కారణంగా 2020లో అనేక సవాళ్లను కోర్టు ఎదుర్కొందని పేర్కొంది. అయితే ప్రజలకు న్యాయం అందించడంలో వెనకడుగు వేయలేదని తెలిపింది.

1950 జనవరి 28న తొలి విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు రిజిస్ట్రీ తెలిపింది. పౌరుల స్వేచ్ఛ, హక్కుల పరిరక్షణతో పాటు రాజ్యాంగ విలువలను కాపాడిందని వెల్లడించింది.

కరోనా సంక్షోభంలోనూ న్యాయస్థానం విధులు నిర్వర్తించిందని రిజస్ట్రీ గుర్తుచేసింది. దాదాపు 99 శాతం మంది సిబ్బంది కొవిడ్‌ బారిన పడినప్పటికీ... 2020లో 231 రోజులు కోర్టు పనిచేసిందని వెల్లడించింది. కరోనా నిబంధనలు, సాంకేతిక సమస్యలు, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ 43,713 కేసులపై వాదనలు ఆలకించిందని రిజిస్ట్రీ తెలిపింది. 2020 డిసెంబర్ 31 నాటికి 1998 బెంచ్​లు కలిసి ఈ కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాయని వెల్లడిచింది.

ABOUT THE AUTHOR

...view details