తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Sun Transit in Leo August 2023 Horoscope : సింహరాశిలోకి సూర్యుడు.. ఆ రాశి వారికి అన్నీ మంచి శకునములే!

Sun Transit in Leo August 2023 Horoscope In Telugu : సూర్యుడు సింహ రాశిలోకి గురువారం (ఆగస్టు 17)న ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.

Sun Transit In Leo August 17th 2023 Horoscope In Telugu
Sun Transit In Leo August 17th 2023 Horoscope In Telugu

By

Published : Aug 16, 2023, 5:23 PM IST

Sun Transit In Leo August 17th 2023 Horoscope In Telugu : సూర్యుడు సింహ రాశిలోకి గురువారం (ఆగస్టు 17)న ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.

మేషం (Aries) : సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో మేషరాశివారికి పూజలు, చదువులపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మంచి సంస్కృతిని అలవరుచుకుంటారు. ఆందోళన, ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. ప్రేమ జీవితంలో విభేదాలు ఉన్నప్పటికీ.. పరిస్థితులు సద్దుమణుగుతాయి.
పరిహారం- ప్రతిరోజూ సూర్య భగవానుడికి కుంకుమతో అర్ఘ్యాన్ని సమర్పించండి.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి సూర్యుడు సింహరాశిలో ప్రవేశించిన తర్వాత ఒక నెల వరకు ఆస్తి కొనుగోలుకు మంచి అవకాశం ఉంటుంది. మీరు ప్రభుత్వ పనుల నుంచి లాభాలను పొందుతారు. మీ తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. భూమి సంబంధిత వ్యవహరాల్లో జాగ్రత్త వహించండి.
పరిహారం- ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి.

మిథునం (Gemini) : సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మిధునరాశి వారికి ఒక నెలపాటు కలిసి వస్తుంది. మిధునరాశి వారిలో ధైర్యాన్ని పెంచుతుంది. మీరు కొత్త ప్రణాళికతో పని చేస్తారు. మీకు చాలా పెద్ద వ్యక్తులు పరిచయం అవుతారు.
పరిహారం - ప్రతిరోజూ ఓం సూర్యా నమః మంత్రాన్ని జపించండి.

కర్కాటకం (Cancer) : సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి ప్రవేశించడం ఒక నెల పాటు కర్కాటక రాశివారికి నిరీక్షణలతో నిండి ఉంటుంది. అయితే.. మీకు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. మీ మాటల్లో కర్కశత్వం ఉంటుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించండి.
పరిహారం - రోజూ గాయత్రి చాలీసా పఠించండి.

సింహం (Leo) : సూర్యుడు గురువారం సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఒక నెలపాటు సింహ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. మీ నాయకత్వ పటిమ పెరుగుతుంది. అయితే.. ఈ సమయంలో మీరు అహంభావంతో కూడా ఉండవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.
పరిహారం- గాయత్రి మంత్రాన్ని పఠించడం మంచిది.

కన్య (Virgo) :సింహరాశిలోకి సూర్యుడు రాక వల్ల కన్య రాశివారికి కలిసి వస్తుంది. విదేశాల్లో సన్నిహితులు నుంచి శుభవార్త వింటారు. దీర్ఘకాలిక వ్యాధి నుంచి విముక్తి పొందుతారు. మీరు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండండి.
పరిహారం - ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయండి.

తుల (Libra) : సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఒక నెల వరకు తులరాశి వారికి కలిసివస్తుంది. రోగాల నుంచి బయటపడతారు. ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ప్రభుత్వ నుంచి ప్రయోజనం పొందుతారు.
పరిహారం - శివునికి జలాభిషేకం చేయండి.

వృశ్చికం (Scorpio) :సింహరాశిలో రాబోతున్న సూర్యుడు మీ ప్రమోషన్‌కు అవకాశం కల్పిస్తాడు. ఈ సమయం మీకు బాగానే ఉంటుంది. మీరు వ్యాపారంలో కూడా లాభపడతారు. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తారు.
పరిహారం -సూర్య భగవానుడికి జలాన్ని సమర్పించండి.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశివారికి ఒక నెల చాలా సానుకూలంగా ఉంటుంది. మీకు చాలా మంది మద్దతు లభిస్తుంది. మీ తండ్రితో మీ బంధం మరింత పెరుగుతుంది. అయితే.. మీ నాన్నగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
పరిహారం-ఆదివారాల్లో ఆవులకు బెల్లం తినిపించండి.

మకరం (Capricorn) : ఒక నెలపాటు మకరరాశి వారికి కలిసివస్తుంది. అయితే.. ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. ఈ సమయంలో మీరు ఉద్యోగం, వ్యాపారంపై దృష్టి పెట్టండి.
పరిహారం- సూర్యునితో పాటు శివుడిని ఆరాధించండి.

కుంభం (Aquarius) : సూర్యుడు సింహరాశిలో సంచరించనున్న నేపథ్యంలో ఒక నెలపాటు కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరితోనైనా విభేదాలు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
పరిహారం - ఆది, సోమవారాల్లో శివుడికి జలాభిషేకం చేయండి.

మీనం (Pisces) : ఈ రాశి వారికి ఒక నెలపాటు కలిసివస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా కొత్త కస్టమర్లను పొందడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. అయితే.. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.
పరిహారం - సూర్యాష్టకం పఠించండి.

ABOUT THE AUTHOR

...view details