తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2021, 4:36 PM IST

ETV Bharat / bharat

ఆన్​లైన్ పాఠాల కోసం విద్యార్థుల సాహసాలు

కరోనా వేళ.. ఆన్​లైన్ పాఠాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సాహసాలు చేస్తున్నారు. సిగ్నల్స్​ అందక.. చెట్లు, కొండలు, గుట్టలు ఎక్కి పాఠాలు వింటున్నారు. కర్ణాటక నమక్కల్​లోని విద్యార్థులు ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంటున్నారు.

climb up trees for online classes
ఆన్​లైన్ పాఠాల కోసం విద్యార్థులు

ఆన్​లైన్ పాఠాల కోసం విద్యార్థుల సాహసాలు

కొవిడ్​-19 దృష్ట్యా పాఠశాలలు పునఃప్రారంభం కాని నేపథ్యంలో విద్యార్థులను కష్టాలు పలకరిస్తున్నాయి. ఆన్​లైన్ పాఠాల కోసం కర్ణాటకలోని విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నమక్కల్​ జిల్లా పెరపంచోళై, పెరియ గొంబాయ్​ గ్రామాల్లోని విద్యార్థులు సిగ్నల్​ కోసం సాహసాలే చేస్తున్నారు. గ్రామంలోని ఎత్తైన చెట్లు ఎక్కి ఆన్​లైన్ పాఠాలు వింటున్నారు.

సిగ్నల్​ పాట్లు
విద్యార్థుల అవస్థలు
సిగ్నల్​ కోసం చెట్టెక్కి..
చెట్టుపై కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థులు

గ్రామంలో సెల్​ఫోన్​ టవర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో సెల్​ఫోన్​ టవర్ ఏర్పాటుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్​ శ్రేయ సింగ్ తెలిపారు.

ఇదీ చదవండి:పెళ్లంటే భయం- కవలలు ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details