తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బర్డ్​ఫ్లూ వెనుక ఏ శక్తి ఉందో?: శివసేన

భాజపా లక్ష్యంగా శివసేన విమర్శనాస్త్రాలు సంధించింది. దేశంలో విస్తరిస్తోన్న బర్డ్​ ఫ్లూ వ్యాధి వెనుక పాకిస్థానీ, ఖలిస్థానీలు ఉన్నారో, లేదో చెప్పాలని పరోక్షంగా విమర్శలు చేసింది. ఈ మేరకు తన అధికార పత్రిక 'సామ్నా'లో ఓ కథనం ప్రచురించింది. రైతుల ఉద్యమం వెనుక పాకిస్థానీ, ఖలిస్థానీ​ గ్రూపులు ఉన్నాయంటూ ఇదివరకు భాజపా నేతలు ఆరోపించారు.

Shiv Sena targets BJP over bird flu, asks if Pak, Khalistanis behind outbreak
బర్డ్​ఫ్లూ వ్యాప్తి వెనుక ఏ శక్తి ఉందో చెప్పాలి: భాజపాకు శివసేన చురకలు

By

Published : Jan 12, 2021, 11:15 AM IST

భారత్​లోని పలు రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తోన్న బర్డ్ ​ఫ్లూ వ్యాధి వెనుక ఎవరి హస్తం ఉందో భాజపా తెలపాలని శివసేన మరోసారి విరుచుకుపడింది. వ్యాధి వెనుక పాకిస్థానీ, ఖలిస్థానీ, చైనీయులు, నక్సలైట్లు.. ఎవరైనా ఉన్నారా? చెప్పాలంటూ.. తన అధికార పత్రిక 'సామ్నా'లో ఓ కథనం ప్రచురించింది.

రైతు ఉద్యమం వెనుక పాకిస్థానీ, ఖలిస్థానీ శక్తులు ఉన్నాయంటూ ఇటీవల భాజపా నేతలు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. బర్డ్​ ఫ్లూ వ్యాధితో పౌల్ట్రీ రంగంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని శివసేన..తన పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాల్లో పౌల్ట్రీ రంగం ప్రస్తావనే లేదని విమర్శించింది.

ఇదీ చదవండి :అన్నదాతల బూట్లు తుడిచి సంఘీభావం

ABOUT THE AUTHOR

...view details