Sharad Pawar Corona: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డాక్టర్ సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
" నాకు కరోనా సోకింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను."
-శరద్ పవార్ ట్వీట్.