భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూపొందించిన ఐటీ, జీఎస్టీ పోర్టల్స్‌లో తలెత్తిన పలు సాంకేతిక లోపాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధ పత్రిక పాంచజన్య చేసిన వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు కొంతమేరకు వెనక్కి తగ్గారు.
ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచారకర్త సునీల్ అంబేకర్ దీనిపై స్పందించారు. పాంచజన్య అనేది ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి కాదని ఆయన అన్నారు. ఇందులో రచయిత తన భావాన్ని వ్యక్తపరుస్తూ రాశారని తెలిపారు. అది కేవలం ఆయన వ్యక్తిగతం మాత్రమేనని చెప్పుకొచ్చారు. దీనిని సంస్థతో ముడిపెట్టకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.