వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనల గురించి చర్చ జరగకూడదనే శీతాకాల సమావేశాల్ని కేంద్రం రద్దు చేసిందన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలపై చర్చించనప్పుడు రూ.1000 కోట్లతో నూతన పార్లమెంటు(సెంట్రల్ విస్టా ప్రాజెక్టు) నిర్మించడం ఎందుకని దుయ్యబట్టారు. ప్రస్తుత పార్లమెంటు భవనం మరో 50 నుంచి 75 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని జోస్యం చెప్పారు. సొంత ఇమేజ్ పెంచుకోవడానికి మొదటితరం నాయకుల గొప్పతనం, జ్ఞాపకాల్ని నాశనం చేయాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు.
'ఆ మాత్రం దానికి నూతన పార్లమెంట్ భవనమెందుకు'
నూతన వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ రైతులు చేస్తోన్న ఆందోళనల అంశాన్ని పార్లమెంటులో చర్చించాల్సి వస్తుందనే శీతాకాల సమావేశాలను రద్దు చేశారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశ సమస్యలపై చర్చించనప్పుడు కొత్తగా పార్లమెంటు భవనాలు నిర్మించడం దేనికని ప్రశ్నించారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో రౌత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
routh
ఈ నెల 10న నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.1000 కోట్లతో చేపట్టనున్న... ఈ భవనం 2022 ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయానికి అందుబాటులోకి రానుంది.
Last Updated : Dec 21, 2020, 7:37 AM IST