Road Accident: పల్నాడు జిల్లాలో కారు లారీ ఢీ.. ముగ్గురు మృతి..
Published : Oct 2, 2023, 7:37 AM IST
|Updated : Oct 2, 2023, 8:39 AM IST
07:34 October 02
వినుకొండ సమీపంలోని పసుపులేరు వాగు వంతెన వద్ద ప్రమాదం
Road Accident near Vinukonda: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. యువకుల మరణంతో వారి కుటుంబ సభ్యుల ఆర్త నాదాలు.. వారి స్వగ్రామాల్లో విషాదాన్ని నింపాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వినుకొండ సమీపంలోని.. పసుపులేరు వాగు వంతెన వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారును లారీ వేగంగా ఢీ కొట్టటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ధాటికి ఘటన స్థలంలోనే ముగ్గురు యువకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని.. గాయపడిన ఇద్దర్ని చికిత్స నిమిత్సం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.