తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Road Accident In Rajasthan : ఆగిఉన్న టెంపోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు పాదచారులు సహా ఐదుగురు మృతి.. గుడికి వెళ్లొస్తూ..

Road Accident In Rajasthan : రాజస్థాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న టెంపోను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. గుజరాత్​లో జరిగిన మరో ప్రమాదంలో 46 మంది యాత్రికులు గాయపడ్డారు.

Road Accident In Rajasthan
Road Accident In Rajasthan

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 9:06 PM IST

Updated : Sep 24, 2023, 10:35 PM IST

Road Accident In Rajasthan :పాదచారులు సహా రోడ్డుపై పార్కింగ్ చేసిన టెంపోపైకి దూసుకొచ్చింది ఓ బస్సు. ఈ ప్రమాదంలో మగ్గురు పాదచారులు సహా మరో ఇద్దరు టెంపోలోని ప్రయాణికులు మరణించారు. మరో ఆరుగురు గాయపడగా.. ఒకరిని జైపుర్​ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాజస్థాన్​ దౌసాలో గాజీపుర్​ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది.

ఇదీ జరిగింది
కైలాదేవిని దర్శించుకున్న భక్తులు.. హిందౌన్ నుంచి మహవాకు టెంపోలో బయలుదేరారు. మార్గమధ్యలో గాజీపుర్ సమీపంలో జాతీయ రహదారిపై టెంపోను పక్కకు ఆపారు. అదే సమయంలో మహవా నుంచి హిందౌన్​కు వేగంగా వెళ్తున్న ఓ ఆర్​టీసీ బస్సు.. రోడ్డు పక్కన ఆగిఉన్న టెంపో సహా పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పాదచారులు, ఇద్దరు టెంపోలోని యాత్రికులు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాదంపై వసుంధర రాజే సంతాపం
ఈ ప్రమాదంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కొండపైన గుడికి వెళ్లి వస్తూ..
Road Accident In Gujarat Today : దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న యాత్రికుల బస్సు అదుపుతప్పి భారీ రాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్​లోని బనాస్​కాంఠా జిల్లాలోని అబాంజీ సమీపంలో జరిగింది. కొండపై నుంచి కిందకు దిగుతున్న క్రమంలో బస్సు అదుపుతప్పింది. అనంతరం పక్కన భారీ రాయిని ఢీకొట్టడం వల్ల బస్సు పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని అంబాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 18 మందిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఖేడా జిల్లాలోని కంజారీ గ్రామానికి చెందినవారిగా గుర్తించిన్నట్లు పోలీసులు తెలిపారు.

Jharkhand Train Robbery News : ట్రైన్​లో రెచ్చిపోయిన దొంగలు.. గన్స్​ పేల్చుతూ బెదిరించి, డబ్బు లూటీ

Maternal Uncle Nephew Died In Ganesh Immersion Video : గణేశ్​ నిమజ్జనంలో విషాదం.. నీట మునిగి మామాఅల్లుళ్లు మృతి

Last Updated : Sep 24, 2023, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details