తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పవార్​ సారథ్యంలో విపక్షాల రాజకీయం.. భాజపా తరఫున షెకావత్​

President election 2022: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భాజపా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​ను కన్వీనర్​గా నియమించింది. మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా ఈనెల 21న సమావేశం కానున్నారు.

d
రాష్ట్రపతి ఎన్నికలు

By

Published : Jun 17, 2022, 3:38 PM IST

President election 2022: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని పార్టీ వర్గాలు, మిత్రపక్షాలను సమన్వయం చేసేందుకు భాజపా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 14 మంది సభ్యులు గల ఈ కమిటీకి కేంద్ర మంత్రి గజేందర్​ సింగ్ షెకావత్​ నాయకత్వం వహించనున్నారు. భాజపా ప్రధాన కార్యదర్శులైన సీటీ రవి, వినోద్​ తవాడే, తరుణ్​ చుగ్​ కూడా ఈ కమిటీలో భాగం కాగా.. రవి, వినోద్​ కో-కన్వీనర్​లుగా వ్యవహరించున్నారు. ఈ విషయాన్ని భాజపా శుక్రవారం వెల్లడించింది. వీరితో పాటు కేంద్రమంత్రులు జీ కిషన్​ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్​, సర్బానంద్​ సోనోవాల్​, అర్జున్​ మేఘ్​వల్​, భారతి పవార్​ కూడా బృందంలో భాగమయ్యారు.

ప్రతిపక్షాలు కూడా..: ప్రతిపక్ష నేతలు కూడా రాష్ట్రపతి ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారు. నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ చీఫ్​ శరద్​ పవార్​ అధ్యక్షతన పార్లమెంట్​ ఆవరణలో ఈనెల 21న సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30కి మొదలయ్యే ఈ సమావేశానికి 17 పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారని సమాచారం.

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికపై అధికార పక్షం ఇప్పటికే ప్రతిపక్షాలను సంప్రదించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. శరద్​ పవార్​, మమతా బెనర్జీ, నితీశ్​ కుమార్, నవీన్​ పట్నాయక్​, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆధిక్యం ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన అభ్యర్థే రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. జులై 18న ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి :దీవిని తలపిస్తున్న స్కూల్​.. చుట్టూ నీరు.. లోపల 150 మంది విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details