తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డేరా బాబాకు బాలుడిని దానం చేసిన తల్లిదండ్రులు.. మగ పిల్లలు పుడతారన్న ఆశతో..

దేశంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. హరియాణాలో అలాంటి ఘటనే జరిగింది. ఏడాదిన్నర బాలుడిని డేరాబాబా ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు అతడి తల్లిదండ్రులు. ఆ కథేంటో ఓసారి చూద్దామా?

parents donate one and half year child
చిన్నారిని దానం చేసిన తల్లిదండ్రులు

By

Published : Nov 10, 2022, 8:12 PM IST

ఏడాదిన్నర చిన్నారిని డేరా బాబా ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు అతడి తల్లిదండ్రులు. హరియాణా కైతాల్​లో జరిగిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలాకు చెందిన దంపతులు తమకు కుమారుడు పుడితే డేరా ఆశ్రమానికి దానం చేస్తామని మొక్కుకున్నారు. వారికి ఇదివరకే ఓ కుమార్తె ఉంది. చిన్నారి అమ్మమ్మ సాధ్వి ప్రభ ముని.. డేరా బాబా ఆశ్రమంలోనే పనిచేస్తున్నారు. డేరా బాబా అనుగ్రహం ఉంటే ఇంకా మగపిల్లలు పుడతారని తమ విశ్వాసమని ఆమె తెలిపారు. అందుకే దంపతులు బాలుడిని ఆశ్రమానికి దానం చేశారని సాధ్వి ప్రభ ముని పేర్కొన్నారు.

చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం ముంబయిలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డేరా బాబా ఆశ్రమానికి చేరుకుని దర్యాప్తు చేశారు. చిన్నారిని ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను ముంబయి నుంచి కైతాల్​కు పిలిపించారు పోలీసులు. ఈ ఘటన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి చేరగా.. వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details