తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​​కు సమాచారం చేరవేత.. పోలీసుల అదుపులో ఐఎస్​ఐ ఏజెంట్

పాకిస్థాన్​కు చెందిన ఓ గుఢాచారి భారత్​లోని అరెస్టయ్యాడు. అతడిని పాక్​కు చెందిన 'ఐఎస్ఐ ఏజెంట్‌'గా పోలీసులు తెలిపారు. ఆ దేశాని​కి ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు.

rajastan
ఫతాన్ ఖాన్

By

Published : Nov 28, 2021, 6:03 AM IST

రాజస్థాన్ ఇంటెలిజెన్స్ బృందం పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ సర్వీస్​(ఐఎస్​ఐ) ఏజెంట్​ను అదుపులోకి తీసుకుంది. భద్రతా సంస్థల సమాచారాన్ని పాక్​కు చేరవేస్తున్నారనే ఆరోపణలపై జైసల్మేర్​కు చెందిన నిబాబ్ ఖాన్‌ సహా.. ఫతాన్ ఖాన్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఫతాన్ ఖాన్

స్థానికంగా ఓ దుకాణం నడుపుతున్న వీరు సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్​కు చేరవేశారనని పోలీసులు ఆరోపించారు. వీరిద్దరూ చాలా కాలంగా ఐఎస్‌ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. నిందితులిద్దరూ పాకిస్థాన్‌కు కూడా వెళ్లివచ్చినట్లు గుర్తించారు. నిబాబ్ ఖాన్ మొబైల్ నుంచి పాక్ వ్యక్తులకు సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం బదిలీ అయిందని తెలిపారు.

నిబాబ్ ఖాన్‌

అదే సమయంలో.. ఫతాన్ ఖాన్ అనే నిందితుడు ట్యూబ్ పంక్చర్ దుకాణాన్ని నడుపుతున్నాడని.. పాకిస్థాన్​ కోసం గుఢాచర్యం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

'అధికారిక రహస్యాల చట్టం కింద నిందితునిపై కేసు నమోదు చేసి వీరిని అరెస్టు చేశాం. పాక్ జాతీయుల నుంచి హవాలా నెట్‌వర్క్ ద్వారా వీరిద్దరూ డబ్బు తీసుకుంటున్నట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. వీరి మొబైల్ ఫోన్ నుంచి కీలక సమాచారం లభించింది' అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details