ఓ నేరాన్ని నేరస్థులెన్ని రకాలుగా చేస్తారు? వారు నేరానికి పాల్పడే విధానమెలా ఉంటుంది? ఇలాంటి వాటిపై జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఓ డేటా బేస్‌ను రూపొందిస్తోంది. కృత్రిమ మేధ, నేచురల్ లాంగ్వేజ్ ప్రోసెస్(ఎన్‌ఎల్‌పీ) సాయంతో నేరస్థుల కార్యప్రణాళిక విధానాన్ని తయారుచేసే పనిలో ఉంది. దీన్నే కార్య ప్రణాళిక బ్యూరో(ఎమ్‌వోబీ)గా పిలుస్తారు. ఇందులో నేరం చేసేటపుడు నేరస్థులు అనుసరించే వందకు పైగా విధానాలు ఉంటాయి.
నేర ముఠాల ఆటకట్టించేందుకు కృత్రిమ మేధ - ఎన్‌సీఆర్‌బీ వార్తలు
నేరస్థుల ఆటకట్టించేందుకు జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) కృత్రిమ మేధను రూపొందిస్తోంది. ఫలితంగా.. నేరస్థులు ఎలా నేరానికి పాల్పడతారు? దానికి కారణాలేంటి? వంటి వివరాలను తెలుసుకునే విధంగా ఓ డేటాబేస్‌ను తయారు చేస్తున్నారు అధికారులు.

ఈ డేటా.. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్(సీసీటీఎన్‌ఎస్) ద్వారా దేశవ్యాప్తంగా 16 వేల పోలీస్ స్టేషన్లకు ద్వారా అందుబాటులోకి రానుంది. దీంతో అయా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది, డేటాబేస్‌లో ఉండే ఎఫ్‌ఐఆర్‌లను చదవొచ్చు. అంతేకాదు నేరస్థుల మానసిక స్థితికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎంవోబీ అందిస్తుంది. ఉదాహరణకు 2019లో హైదరాబాద్‌లో ఓ మహిళపై అత్యాచారం, హత్య చేసిన హంతకుల మనస్తత్వాన్ని విశ్లేషిస్తున్నారు. ఆ నేరస్థులు పోలీసుల కాల్పుల్లో మరణించకుండా ఉంటే వారు అలాంటి నేరాలకు తిరిగి పాల్పడతారా లేదా లాంటి మానసిక విశ్లేషణలు ఎంవోబీలో ఉంటాయి.
ఇదీ చదవండి:8వ అత్యధిక ఉష్ణోగ్రతల సంవత్సరంగా 2020