తన సొంత మనుషులే తనకు ద్రోహం చేశారని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నేత చిరాగ్ పాసవాన్ అన్నారు. తన తండ్రి రామ్ విలాస్ పాసవాన్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను 'ఆశీర్వాద్ యాత్ర' చేపడుతున్ననట్లు పేర్కొన్నారు.
"నా అనుకున్న వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి కర్మభూమి అయిన హాజీపుర్ నుంచి ఆశీర్వాద్ యాత్రను ప్రారంభిస్తున్నాను. ఇది ప్రతీ జిల్లాలో జరుగుతుంది. ప్రతీ ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. నా బలం చూపించేందుకు నాకు శక్తి లేదు. నా అనుకున్న వాళ్లే నాకు ద్రోహం చేశారు."
-చిరాగ్ పాసవాన్, ఎల్జేపీ నాయకుడు
'నాకు బిహార్ ప్రజల ఆశీర్వాదం కావాలి. నాకు ఇప్పుడు ఎవరూ లేరు ప్రజలు తప్ప. ఈ యాత్రకు ప్రత్యేకత ఏం లేదు. ఈ రోజు మా నాన్నకు నివాళులర్పించడానికి నేను, మా అమ్మ మాత్రమే ఉన్నాం. ఇదే రోజున బాబాయి, నా సోదరులు మాతో ఉంటారు అనుకున్నా.. కానీ లేరు.' అని చిరాగ్ అన్నారు. అనంతరం ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరాగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'పాసవాన్' అనే పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నివాళి...
లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత రామ్ విలాస్ పాసవాన్కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ క్రమంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాలు వారి అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేమని కొనియాడారు.
ఇదీ చూడండి:వేడెక్కిన రాజకీయం- చిన్న పార్టీలతోనే అసలు చిక్కులు