మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని ఓ చెత్తకుప్పలో కొవిషీల్డ్ టీకాలు (Covishield Vaccine) దర్శనమిచ్చాయి. మౌగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెనక భాగంలో ఉండే చెత్త కుండీలో సుమారు 200 వ్యాక్సిన్ డోసులు కనిపించాయి. వీటి ఎక్స్పైరీ తేదీ 2022గా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ విషయంపై వైద్యాధికారులను ప్రశ్నించగా.. వారు దాటవేసే ప్రయత్నం చేశారు.
చెత్తకుప్పలో గుట్టలుగా కొవిడ్ వ్యాక్సిన్లు.. ఎవరి పని? - మధ్యప్రదేశ్‌లో చెత్తకుప్పలో వ్యాక్సిన్లు
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో కొవిషీల్డ్ వ్యాక్సిన్లు (Covishield Vaccine) చెత్తకుప్పలో కనిపించాయి. దీంతో స్థానికంగా కలకలం రేగింది. సుమారు 200లకు పైగా కొవిడ్ టీకాలు అక్కడ ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్లు
చెత్తకుప్పలో గుట్టలుగా కొవిడ్ వ్యాక్సిన్లు
ఈ విషయంపై మాట్లాడేందుకు ఛీప్ మెడికల్ ఆఫీసర్ బీఎల్ మిశ్రా తొలుత నిరాకరించారు. దీనిపై విచారణ అనంతరం మాట్లాడిన ఆయన.. మెడికల్ వ్యర్థాలకు దూరంగా టీకాలను ఉంచినట్లు పేర్కొన్నారు. అదేమీ తప్పు కాదని చెప్పుకొచ్చారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతుందని హమీ ఇచ్చారు.
ఇదీ చూడండి:ల్యాబ్‌లోకి వరద నీరు.. శాస్త్రవేత్తల కష్టం నీటి పాలు!