తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికపై సామూహిక అత్యాచారం.. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య - rape in haryana

Haryana Gangrape Suicide: హరియాణాలో ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. అయితే.. మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ఉత్తరాఖండ్​లో చికిత్స కోసం వెళ్లిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వైద్యుడు.

charkhi dadri gangrape suicide
అత్యాచారం

By

Published : Apr 1, 2022, 10:54 PM IST

Updated : Apr 1, 2022, 11:34 PM IST

Haryana Gangrape Suicide: హరియాణాలో దారుణం జరిగింది. చరఖీ దాదరీ జిల్లాలో మైనర్​పై(17 ఏళ్లు) ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు 12వ తరగతి చదువుతోంది. పరీక్షలు దగ్గర పడుతున్న క్రమంలో ఇంటి దగ్గరే ఉండి సన్నద్ధమవుతుంది. ఆమె తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఇంటి దగ్గర బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టారు నిందితులు. ఆమెను ఇంటిపై ఉన్న గదిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న బాధితురాలు మామయ్యపై కూడా నిందితులు దాడి చేశారు. అత్యాచారంతో తీవ్ర మనస్తానికి గురైన బాధితురాలు ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించిన పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

వైద్యుడి లైంగిక వేధింపులు:చికిత్స కోసం వచ్చిన బాలికపై(16) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వైద్యుడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​లోని డూన్​ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగింది. బాధితురాలు చాలా కాలంగా టీబీ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. మార్చి 4, 2020 నుంచి కొత్త డాక్టర్ డా. అయోధ్య ప్రసాద్ చికిత్స చేస్తున్నాడు. రెగ్యులర్ చెకప్​ల పేరిట పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చికిత్సకు వెళ్లకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కాల్స్, మెసేజ్​లతో వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య.. రాళ్లతో ముఖాలు ఛిద్రం..

Last Updated : Apr 1, 2022, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details