ఓ వ్యక్తిని ఇనుప రాడ్‌తో చితకబాదారు ఇద్దరు దుండగులు. అంతటితో ఆగక బలవంతంగా చెత్తను తినిపించారు. గత నెలలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర ముంబయిలో జోగేశ్వరి అనే ప్రాంతంలో తీసినట్లుగా చెబుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వీడియో రూపంలో తమ దృష్టికి వచ్చిన ఈ ఘటనపై స్పందించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అబ్దుల్ ఖలీద్ మాలిక్ షేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను పలు కేసుల్లో నిందితునిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత ఘటనలో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక మరో నిందితుడు.. షేక్‌కు సహకరించిన ఫహిద్ జాహిద్ అలీ షేక్ పరారీలో ఉన్నాడని తెలిపారు.