Lalu Modi Dynasty Politics: కుటుంబ రాజకీయాలను విమర్శిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై బిహార్ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఆయనకు రాజకీయ వారసత్వం లభించాలనే ప్రార్థిస్తున్నానని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారూ లాలూ.
"మోదీకి పిల్లలు లేరు. నితీశ్ కుమార్‌కు కొడుకు ఉన్నా.. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి లేదు. వారిద్దరికి రాజకీయ వారసులు లభించాలనే నేను ప్రార్థిస్తున్నా."
-లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ అధినేత
లాలూ కుమారుడు, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సైతం మోదీ, నితీశ్ కుమార్లపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఈ నేతలిద్దరూ ఒకరినొకరు విమర్శించుకునేవారని గుర్తు చేశారు. అధికారం కోసం మనసు మార్చుకొని కలిసి ఉన్నారని ఆరోపించారు.
హిమంత అనుచిత వ్యాఖ్యలు
మరోవైపు, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు రాహుల్ గాంధీ రుజువులు అడిగారని, మరి ఆయన తన తండ్రికే పుట్టారనేందుకు సాక్ష్యం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి:యూపీలో సంకీర్ణం తప్పదా? తొలి దశ పోలింగ్ ఏం చెబుతోంది?