తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kisan Rin Portal Details and Benefits in Telugu : అన్నదాతకు శుభవార్త.. అప్పుకోసం వడ్డీ వ్యాపారి వద్దకు అవసరం లేదు! - పీఎం కిసాన్​ రిన్ పోర్టల్​ ఎలా ఉపయోగించాలి

Kisan Rin Portal Details and Benefits in Telugu: దేశంలోని రైతులందరికీ గుడ్ న్యూస్. ఇకపై అన్నదాతలు రుణాలు పొందేందుకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేంద్రం ఓ వెబ్ పోర్టల్​ తీసుకొచ్చింది. దీని ద్వారానే లోన్స్ తీసుకోవచ్చు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

PM Kisan Rin Portal
Kisan Rin Portal Details and Benefits in Telugu

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 11:07 AM IST

PM Kisan Rin Portal Details in Telugu :దేశంలో రైతులు పొలం మడిలో కాలు పెట్టాలంటే.. ముందుగా వడ్డీ వ్యాపారుల గడప తొక్కాల్సిన పరిస్థితి దాపురించింది. మెజారిటీ చిన్న, సన్నకారు రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తుంటే.. మరికొందరు భార్య నగలు తాకట్టు పెట్టి సాగు చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి నుంచి అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అవి పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. దాంతో దేశంలో రోజురోజుకూ రైతుల సంఖ్య తగ్గిపోతోంది. అన్నదాతలు తమ పిల్లలను వ్యవసాయం వైపు ప్రోత్సహించట్లేదు. అందుకే.. ప్రభుత్వాలు అన్నదాతను ఆదుకోవడంపై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం(Central Government)దేశంలోని రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలకు చౌక వడ్డీకే రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్​ను తీసుకొచ్చింది. ఇంతకీ ఆ పోర్టల్​ ఏంటి? దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

PM Kisan Rin Portal Benefits in Telugu : రైతుల సంక్షేమం కోసం కేంద్ర సర్కార్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆ పోర్టల్ పేరు.. పీఎం కిసాన్ రిన్ పోర్టల్​(PM Kisan Rin Portal). దీనిని కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కలిసి అధికారికంగా లాంఛ్ చేశారు. ఇది అనేక ప్రభుత్వ శాఖల సహకారంతో అభివృద్ధి చేయబడింది. రైతులకు కేంద్రం అందిస్తున్న అన్ని రకాల పథకాలతోపాటు, రుణాలు, వాటి వడ్డీ రేట్లతో సహా అన్ని రకాల వివరాలను కిసాన్ రిన్ పోర్టల్​ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే అందుబాటులో ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు(Kisan Credit Card) పథకం ద్వారా రైతులు రుణాలు పొందే వీలును కేంద్రం కల్పిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా రైతులకు తమకు అవసరమైన రుణాలకు అప్లై చేసుకోవచ్చు.

PM Kisan Yojana Ineligible : 'పీఎం కిసాన్​'కు 81వేల మంది అనర్హులు.. ఆ రైతులంతా డబ్బులు తిరిగివ్వాల్సిందే!

Kisan Credit Card Scheme : ఇప్పటి వరకు అన్నదాతలకు రుణాలు మంజూరు చేసేందుకు ఎలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో లేదు. అయితే, ఇటీవల కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పీఎం కిసాన్ రిన్ పోర్టల్‌లో రైతుల పూర్తి డేటా, రుణాల మంజూరు, వడ్డీ రాయితీ క్లెయిమ్ చేసుకోవడం లాంటివన్నీ ఉంటాయి. ఇకపై అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఈ వెబ్‌సైట్ ద్వారా లోన్స్ పొందవచ్చు. ఈ పోర్టల్‌లో 97 కమర్షియల్ బ్యాంకులు, 58 రీజనల్ రూరల్ బ్యాంకులు, 512 కో-ఆపరేటివ్ బ్యాంకులు రుణాలు ఇస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు https://fasalrin.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.

Ghar Ghar KCC Abhiyan :ఇక దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 30 నాటికి 7.35 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి. పీఎం కిసాన్ పథకంలో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలు తీసుకోని వారికి, ఈ స్కీమ్​ గురించి తెలియజేసేందుకు కేంద్ర సర్కార్ 'ఘర్ ఘర్ కేసీసీ అభియాన్' పేరుతో డోర్ టు డోర్ క్యాంపైన్​ ప్రారంభించారు. దీని కింద 1.5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది కేంద్రం. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా సబ్సిడీ వడ్డీ రేటుకు రూ.3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ డేటా సిస్టమ్ (WINDS)ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా రైతులు రియల్ టైమ్​లో వాతావరణ వివరాలను పొందేందుకు వీలు ఉంటుంది. అలాగే రైతులు తమ పంటలకు సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

వయసు పైబడిన రైతులకు రూ.3000 పింఛన్​.. అర్హతలేంటి? ఎలా అప్లై చేసుకోవాలి?

Mango Farmers Problems : వానలతో కొంత.. ధరలు లేక మరికొంత.. దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details