తెలంగాణ

telangana

By

Published : Jun 5, 2021, 10:53 AM IST

ETV Bharat / bharat

'కరోనా కట్టడి కోసం ప్రతీ గ్రామానికి రూ.50వేలు'

గ్రామీణ ప్రాంతాల్లో కరోనాను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.50వేలు చొప్పున నిధులను ప్రకటించింది. మొత్తం రూ.2.33 కోట్లను కొవిడ్​ కట్టడి కోసం కేటాయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

karnataka covid relief,కర్ణాటక గ్రామ పంచాయతీ
కరోనా కట్టడికి ప్రతీ గ్రామానికి రూ. 50 వేలు

కర్ణాటకలోని ప్రతీ గ్రామపంచాయతీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేలు కేటాయించింది. కరోనా కట్టడి నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రూ2.33 కోట్లను కొవిడ్​ కట్టడి కోసం కేటాయించామని ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. 20కేఎల్​ ఆక్సిజన్​ ట్యాంక్​, 1500 ఎల్​పీఎం ఆక్సీజనరేటర్​ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపామన్నారు.

ఇదీ చదవండి :Yediyurappa: నా దృష్టంతా ఆ విషయంపైనే

ABOUT THE AUTHOR

...view details