IT department raids: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలపై.. 'ది యూనివర్సల్ ఎడ్యుకేషన్ గ్రూప్'(యూఈజీ) సంస్థ యజమాని జీసస్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది. ముంబయిలోని 12 ప్రాంతాలతో పాటు, ఠాణె, వసాయ్, నాశిక్, మిరా భయిందర్, ఔరంగబాద్లలో తనిఖీలు చేపట్టింది. తమిళనాడులోని తిరుచినాపళ్లి, బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనూ రైడ్లు నిర్వహించింది.
దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు.. అక్రమార్కులపై ఏసీబీ నజర్!
IT department raids: దేశంలోని అనేక ప్రదేశాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు, అక్రమాస్తుల కేసులో భాగంగా కర్ణాటక ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. 400 మంది అధికారులు, సిబ్బంది ఇందులో భాగమయ్యారు.
it raids
మరోవైపు, అక్రమాస్తుల కేసుల్లో భాగంగా 18 మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లల్లో కర్ణాటక ఏసీబీ సోదాలు నిర్వహించింది. మొత్తం 75 ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఏసీబీకి చెందిన 100 మంది అధికారులు, 300 మంది సిబ్బంది సోదాల్లో భాగమయ్యారు.
ఇదీ చదవండి:పోలీసుల ఎన్కౌంటర్.. అత్యాచార నిందితుడు మృతి