తెలంగాణ

telangana

By

Published : Jan 14, 2021, 5:43 AM IST

ETV Bharat / bharat

నక్కి ఉన్న ఉగ్రవాదులను పసిగట్టే 'మైక్రోకాప్టర్​'

భద్రతా దళాల గాలింపు సమయంలో భవనాలు, గదుల్లో నక్కి ఉండే ఉగ్రవాదులను పసిగట్టేందుకు 'మైక్రోకాప్టర్​' యంత్రాన్ని తయారు చేశారు భారత సైన్యాధికారి జీవైకే రెడ్డి. దీని పనితీరును పారా మిలిటరీ ప్రత్యేక దళాలు జమ్ముకశ్మీర్​లోని బెటాలియన్​లో విజయవంతంగా పరీక్షించాయి.

Indian Army officer develops 'microcopter' for tracking terrorists inside buildings
ఉగ్రవాదులను పసిగట్టే యంత్రాన్ని అభివృద్ధి చేసిన ఆర్మీ అధికారి

ఉగ్రవాదుల పని పట్టేందుకు భారత సైన్యాధికారి ఒకరు సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 'మైక్రోకాప్టర్​'ను తయారు చేశారు. భద్రతా దళాలు ఆపరేషన్​ నిర్వహించే సమయంలో భవనాలు, గదుల్లో నక్కి ఉండే ముష్కరులను పసిగట్టేందుకు లెఫ్టినెంట్ కర్నల్​ జీవైకే కర్నల్​ దీనిని అభివృద్ధి చేశారు.

ఉగ్రవాదులను పసిగట్టే యంత్రాన్ని అభివృద్ధి చేసిన ఆర్మీ అధికారి

మైక్రోకాప్టర్​ పనితీరును పారా మిలిటరీ ప్రత్యేక దళాలు జమ్ముకశ్మీర్​లోని బెటాలియన్​లో విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ మైక్రోడ్రోన్​కు మరింత మెరుగ్గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.

సరిహహద్దులో నిఘా కోసం స్విచ్​ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి 4,500 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 2గంటలు పాటు ఎగురగలవు.

ఇదీ చూడండి: నోట్ల మార్పిడికి పాల్పడ్డ ఆరుగురిపై సీబీఐ కేసు

ABOUT THE AUTHOR

...view details