తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ తగ్గుముఖం- 2 లక్షల దిగువకు కొత్త కేసులు - కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం కొత్తగా 1,96,427 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 3,511 మంది కొవిడ్​తో మరణించారు.

corona cases in india
భారత్​ కరోనా కేసులు

By

Published : May 25, 2021, 10:07 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 1,96,427 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 3,511 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 69 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 3లక్షల 7వేలు దాటింది.

  • మొత్తం కేసులు:2,69,48,874
  • మొత్తం మరణాలు: 3,07,231
  • కోలుకున్నవారు: 2,40,54,861
  • యాక్టివ్ కేసులు: 25,86,782

33 కోట్లు దాటిన పరీక్షలు

దేశవ్యాప్తంగా సోమవారం 20,58,112 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్టు​ల సంఖ్య 33 కోట్ల 25 లక్షల 94 వేల 176కు చేరింది.

వ్యాక్సినేషన్​​

దేశంలో ఇప్పటివరకు 19 కోట్ల 85 లక్షల 38 వేల 999 టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details