India Corona Cases:భారత్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 2,288 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 10 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు మళ్లీ 20 వేల దిగువకు చేరాయి. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజే 3044 మంది కొవిడ్ నుంచి కోలుకొని.. డిశ్చార్జయ్యారు. యాక్టివ్ కేసుల శాతం 0.05, మరణాల శాతం 1.22గా ఉంది.
మొత్తం కరోనా కేసులు:4,31,07,689
మొత్తం మరణాలు: 524103
యాక్టివ్ కేసులు:19637
కోలుకున్నవారి సంఖ్య:42563949
Vaccination India:దేశవ్యాప్తంగా సోమవారం 13 లక్షల 90 వేల 912 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190 కోట్ల 50 లక్షల 86 వేలు దాటింది. 12-14 ఏళ్ల వయసుగల 3 కోట్ల మందికిపైగా యువత వ్యాక్సిన్ తొలి డోసు పొందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఒక్కరోజే మరో 4 లక్షల 84 వేల 843 టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం పరీక్షల సంఖ్య 84.15 కోట్లు దాటింది.
Global Corona Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. సోమవారం కొత్తగా 3 లక్షల 33 వేలకుపైగా కేసులు.. వెయ్యికిపైగా మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 51 కోట్ల 76 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 62 లక్షల 77 వేలకు చేరింది.
- అమెరికాలో ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు.. 100కు పైగా మరణాలు వెలుగుచూశాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8 కోట్లకుపైనే.
- జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియాల్లో రోజువారీగా సగటున 40 వేలకుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.
- దక్షిణ కొరియాలో సోమవారం ఒక్కరోజే 20 వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్, రష్యాల్లో రోజుకు 10వేలకు దిగువనే కొత్త కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
ఇవీ చూడండి:ఏసీ, ఫ్రిజ్, ఇంటర్నెట్.. తెగ వాడేస్తున్న భారతీయులు!
మనవడిపై బామ్మ పోలీసు కేసు.. పెంపుడు శునకం కరిచిందని..