కర్ణాటక చిక్కమగళూరు జిల్లా బిసిలి గ్రామంలో మైనర్‌ను పెళ్లి చేసుకుంది ఓ 20 ఏళ్ల యువతి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఇదీ కథ..
కర్ణాటక చిక్కమగళూరు జిల్లా బిసిలి గ్రామంలో మైనర్‌ను పెళ్లి చేసుకుంది ఓ 20 ఏళ్ల యువతి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఇదీ కథ..
బెంగళూరుకు చెందిన యువతికి.. కడూర్కు చెందిన 17 ఏళ్ల బాలుడితో ఉన్న స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అబ్బాయి ఆమె కన్నా మూడేళ్లు చిన్న అని తెలిసినా వారి పెద్దలు పెళ్లికి అంగీకరించారు.
ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో జూన్ 16న వారి కల్యాణం జరిగింది. కాగా, జూన్ 23న సమాచారం అందుకున్న పోలీసులు.. యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:14 ఏళ్ల బాలికతో ఎంపీ పెళ్లి- దర్యాప్తు షురూ