IGLOO CAFE IN KASHMIR: జమ్మూకశ్మీర్ గుల్మార్గ్లో ఉన్న ఓ ఇగ్లూ కేఫ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. స్నోగ్లూ పేరిట 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల విస్థీర్ణంలో ఈ ఇగ్లూను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ చూడటానికి వచ్చే పర్యాటకులు.. ఈ ఇగ్లూను చూడటానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ఈ స్నోగ్లూను రెండు భాగాలుగా విభజించారు. ఒక సెక్షన్లో అతిథులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. మరో దాంట్లో మంచుతో కళాఖండాలు తీర్చిదిద్దారు. రెండు నెలల పాటు శ్రమించి ఈ స్నోగ్లూను నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు.
"ఈ కేఫ్‌లో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి డైనింగ్ కోసం, మరొకటి మంచుతో చేసిన కళాకృతుల కోసం ఏర్పాటు చేశాం. టేబుళ్లు, కుర్చీలే కాకుండా అలంకరణ వస్తువులనూ మంచుతోనే నిర్మించాం. టేబుళ్లపైన గొర్రెల చర్మాన్ని కవర్లగా ఏర్పాటు చేశాం. పర్యటకులు కాశ్మీరీ సంస్కృతిని ఆస్వాదించొచ్చు."
- మెహుర్, కేఫ్ నిర్వాహకురాలు