గంగానది ఒడ్డున రోజుకోచోట భారీగా మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బిహార్‌లో ఇసుకలో మృతదేహాలు తేలిన ఘటన మరువకముందే.. ఉత్తర్ప్రదేశ్లో మరో ఘటన వెలుగుచూసింది. ప్రయాగ్రాజ్ జిల్లా దేవరఖ్ ఘాట్ వద్ద గంగానది ఒడ్డున ఇసుకలో వందల మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. అయితే శ్మశాన వాటికల్లో ఖాళీ లేకపోవటం, అంత్యక్రియలకు ఖర్చు పెరగటం వల్ల నది ఒడ్డునే ఇసుకలో పూడ్చి పెడుతున్నారని స్థానికులు తెలిపారు. ఇవన్నీ కొవిడ్ మరణాలేనని ఆరోపిస్తున్నారు.
" ఇలాంటి దృశ్యాన్ని గంగానది ఒడ్డున మేము ఎప్పుడూ చూడలేదు. అంత్యక్రియల కోసం చాలా తక్కువగా మృతదేహాలు మాత్రమే వచ్చేవి. కానీ కొవిడ్ రెండో దశ తర్వాత కుప్పలు తెప్పలుగా మృతదేహాలు వస్తున్నాయి."