Horoscope Today: ఈరోజు (18-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవ నామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం; శుక్లపక్షం
చతుర్దశి: ఉ. 6.29 తదుపరి పూర్ణిమ రోహిణి: మ. 1.53 తదుపరి మృగశిర
వర్జ్యం: రా. 7.45 నుంచి 9.32 వరకు
అమృత ఘడియలు: ఉ.10.01 నుంచి 11.47వరకు తిరిగి తె. 6.24 నుంచి
దుర్ముహూర్తం: ఉ. 6.28 నుంచి 7.55 వరకు
రాహుకాలం: ఉ. 9.00 నుంచి 10.30 వరకు
సూర్యోదయం: ఉ.6.28, సూర్యాస్తమయం: సా.5-25
మేషం
మీ మీ రంగాల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శివస్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు.
వృషభం
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యంతో ఇబ్బందులు తొలుగుతాయి. శివారాధన శుభప్రదం.
మిథునం
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.
కర్కాటకం
మీదైన రంగంలో ప్రగతి సాధిస్తారు. బంధుమిత్రులను కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత ఉంది. విందువినోదాల్లో పాల్గొంటారు. సూర్యారాధన చేస్తే మంచిది.
సింహం
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.
కన్య
ప్రారంభించిన పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
తుల
తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.
వృశ్చికం
స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
ధనుస్సు
ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూలమైన, మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. నూతన వస్తువులు కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం శుభప్రదం.
మకరం
శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ స్వధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. శివారాధన వల్ల మంచి జరుగుతుంది.
కుంభం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ విష్ణు ఆరాధన మంచిది.
మీనం
పట్టుదల చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. ఎవరితోనూ విభేదించకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివుడిని ఆరాధిస్తే మంచిది.
ఇదీ చూడండి:Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (డిసెంబర్ 12 - డిసెంబర్ 18)